News

శ్రీ రాముడి ఫ్లెక్సీని దహనం చేసిన ఐంథం తమిళర్ సంఘం..

254views

తమిళనాడులోని తిరుచ్చిలో హైందవ వ్యతిరేకులు బరితెగించారు. ఐంథం తమిళర్ సంఘం శ్రీరాముడి చిత్ర పటాన్ని బహిరంగంగా దహనం చేసింది.అంతేకాకుండా రాముడి చిత్రపటంతో వున్న దిష్టిబొమ్మను చెప్పులతో కూడా కొట్టారు. దీంతో హిందువుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో స్థానిక హిందువులు, హిందూ సంస్థలు, బీజేపీ నేతలు తిరుచ్చి సైబర్ క్రైమ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

మరోవైపు తిరుచ్చిలో జరిగిన ఈ హైందవ వ్యతిరేక ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు ఓ గుంపుగా ఏర్పడి, రాముడి చిత్ర పటానికి నిప్పంటించారు. రావణుడిదే జయం అంటూ నినాదాలు కూడా చేశారు. అంతేకాకుండా రాముడు ఉత్తర భారత దేవుడు అని, తమిళుడు కాదని కూడా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ చర్యను ఆ బృందం సమర్థించుకుంది. అయితే.. రాముడ్ని అలా చేసిన వ్యక్తి ఆ సంస్థ నేత పాండియన్ గా పోలీసులు గుర్తించారు. త్రిచి సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ 2న ఇయంతం తమిళర్ సంఘంతో సంబంధం ఉన్న ఫేస్‌బుక్ ఖాతాపై క్రైమ్ నెం. 18/2025 కేసు నమోదు చేసి చర్య తీసుకున్నారు.