
251views
హిందువుల ఆత్మరక్షణ కోసం విజయదశమి రోజు ఏర్పడిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఆర్ఎస్) వందేళ్లు అయ్యిందని, క్రమశిక్షణకు మారుపేరని ప్రాంత కుటుంబ ప్రబోదన్ ప్రముఖ్ పుట్టశేషు అన్నారు. కర్నూలు జిల్లా మద్దికెర శనివారం స్థానిక మద్దమ్మ దేవాలయ ఆవరణలో ఆర్ఎస్ ఎస్ వందేళ్ల ఉత్సవాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 1925లో కేశవ బలీరాం హెడ్గేవార్ 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించారని తెలిపారు. హిందూ క్రమశిక్షణ ద్వారా పాత్ర శిక్షణ ఇవ్వడం , భారతీయ సంస్కృతిని, పౌర సమాజం యొక్క విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహి స్తామని చెప్పారు. కార్యకర్తలు శ్రీనివాసులు, జయకృష్ణ పాల్గొన్నారు.




