
327views
గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులపై ఆందోళన అవసరం లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆస్తులను పరిరక్షిస్తూ ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ కోసం 56 రోజులు వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నారని, వినియోగానికి రూ.45 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరిందని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీకి ఆయన చెక్కు అందజేశారు.
వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద చెక్కు ఉంచి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవిష్యత్‌లో మరింత ఆదాయం సమకూరేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భూములను పరిరక్షించడం తమ తక్షణ కర్తవ్యమని, అవసరం మేరకు భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపాడుకుంటామని వివరించారు. స్వామివారి సమక్షంలోనే ఒప్పందం చేసుకోవడం హర్షణీయమన్నారు.





