News

భారతీయ రాతప్రతుల సంరక్షణకు ప్రతిన

183views

ప్రాచీన రాతప్రతులు భవిష్యత్తుకు దారి దీపాలనీ, వాటిని డిజిటలీకరించి, పదిలపరచి, అందరికీ అందుబాటులో ఉంచుతామని పరిశోధకులు, విద్వాంసులు, నిపుణులు శనివారం వాగ్దానం చేశారు. దిల్లీలో మూడు రోజులపాటు జరిగిన జ్ఞాన భారతం మహాసభ ముగింపు సందర్భంగా వారు ‘న్యూదిల్లీ డిక్లరేషన్‌’ పేరిట వాగ్దాన పత్రం విడుదల చేశారు. స్వదేశంలో మరుగునపడిన, విదేశాలలో ఉన్న భారతీయ రాతప్రతులను లేదా వాటి డిజిటల్‌ ప్రతులను సేకరించి పరిశోధన సాగిస్తామనీ, భారత సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షిస్తామనీ ఈ డిక్లరేషన్‌ ప్రకటించింది.