News

అక్షర దేవతలకో ఆలయం

221views

తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం సరస్వతీ ఘాట్‌లో అక్షర దేవతల ఆలయం రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మికవేత్త తోట సుబ్బారావు సంకల్పంతో నిర్మితమవుతున్న ‘శ్రీజ్ఞాన సరస్వతీ పీఠం’లో స్తంభాలపై అక్షర దేవతల రూపాలను చెక్కించారు. తెలుగు వర్ణమాలలో ఒక్కో అక్షరానికి ఉన్న దేవతామూర్తులను ఎంతో చక్కగా స్తంభాలపై చెక్కించి, అర్థమయ్యేలా దేవతల పేర్లనూ రాయించారు. ప్రధానాలయంలో చదువుల తల్లి సరస్వతీదేవి దర్శనమిస్తారు. అంతేకాక ఘాట్‌ పొడవునా తెలుగుతల్లి, వ్యాసభగవానుడు, గోదావరి మాత వంటి విగ్రహాలు నెలకొల్పారు. మాతృభాషను ముందుతరాలకు చేరువ చేయడానికి ఆలయ నిర్మాణం చేపట్టామని సుబ్బారావు తెలిపారు.