
188views
జాతీయ సంస్కృత వర్సిటీలో అబుదాబికి చెందిన అక్షర పురుషోత్తమ మందిర ప్రముఖులు బ్రహ్మ బిహారీ దాస్ స్వామితో పాటు 60మంది సాధువులు పర్యటించారు. బిహారి దాస్ స్వామి మాట్లాడుతూ, భారత దేశంలో సంస్కృత విశ్వవిద్యాలయం అద్భుతంగా ఉందని కొనియాడారు. సంస్కృతంతో పాటు అక్షర పురుషోత్తమ దర్శనాన్ని కల్పించిన వర్సిటీ అధికారులు అభినందనీయులన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ కడి యం వెంకటనారాయణ, డీన్ దక్షణమూర్తి శర్మ, రజినీకాంత్ శుక్లా, ఆర్వీ శేషుకుమార్, ఉత్కల పీఠం డైరె క్టర్ జ్ఞాన రంజన పండా, అధికారులు పాల్గొన్నారు.





