News

లక్ష్మణానంద సరస్వతీ స్మృత్యర్థం ఒడిశాలో ‘‘మారథాన్’’.. పాల్గొన్న 4 వేల మంది

214views

జన్మాష్టమి, స్వామి లక్ష్మణానంద సరస్వతీ బలిదాన్ దివస్ ను పురస్కరించుకొని భువనేశ్వర్ లో మినీ మారథాన్ నిర్వహించారు. దీనిలో 4,000 మందికి పైగా పాల్గొన్నారు. యువతే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి లక్ష్మణానంద సరస్వతీ సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మారథాన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై, శ్రీరామ మందిర్ శ్రేయ చౌక్, మాస్టర్ క్యాంటీన్, గిరిదుర్గా ఆలయం మీదుగా ప్రధాన కేంద్రాల గుండా సాగింది.

ఈ సందర్భంగా ధర్మ పరిరక్షణ విషయంలో 4,000 మంది సంకల్పం తీసుకున్నారు. స్వామి శ్రద్ధానంద సరస్వతీ మహారాజ్, అఖిల భారతీయ సంత్ సమితి జాతీయ సహ సంఘటన్ మంత్రి మరియు ఒడిశాలోని రాధాబల్లవ్ మఠానికి చెందిన మహంత్ రామకృష్ణ దాస్ మహారాజ్‌తో సహా అనేక మంది సాధు సంతులు పాల్గొన్నారు.

కృష్ణాష్టమి రోజునే జలేష్‌పటలోని శంకరాచార్య పాఠశాలలో జరిగిన దాడిలో స్వామి లక్ష్మణానంద సరస్వతీ విషాదకరంగా హత్యకు గురయ్యారు.స్వామీజీ జ్ఞాపకార్థం ఒడిశా అంతటా సెమినార్లు, ఆరోగ్య శిబిరాలు మరియు చర్చలు వంటి వరుస స్మారక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్‌ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన ముఖ్య శిష్యులపై మతోన్మాదులైన సాయుధ ముష్కరులు తుపాకులు, గండ్ర గొడ్డళ్ళతో కృష్ణాష్టమి రోజే దాడిచేసి క్రూరంగా హత్యచేశారు. దానికి కారణం ఆ స్వామీజీ ధర్మాచార్యునిగా తన కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధంగా, అహింసాయుతంగా నిర్వహించడం! అమాయకులైన వనవాసులను (ఎస్‌.టి.) స్థానిక క్రైస్తవ మిషనరీలు మతం మార్చడం, వారి హక్కులను హరించడం వంటి ఆగడాలకు పాల్పడేవారు. వారి గోసంపదను కబేళాలకు (పశువధశాలలకు) తరలించడం, స్థానిక పండుగలు శ్రీరామనవమి, జగన్నాథ రథయాత్ర వంటి వాటిని అడ్డుకోవడం నిత్యకృత్యంగా మారింది. స్థానిక కాంధ్‌ తెగకు చెందిన వనవాసులు క్రైస్తవులు చేస్తున్న ఈ ఆగడాలకు తాళలేక స్వామి లక్ష్మణానంద నేతృత్వంలో వారిపై తిరగబడ్డారు. ప్రజా ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత గల పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి మిషనరీలకూ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే స్మగ్లర్లకూ వంత పాడేవారు.

ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మ పరిరక్షణకు, వనవాసుల కనీస మానవ హక్కుల పరిరక్షణకు నడుం బిగించిన స్వామి లక్ష్మణానంద జిల్లాలోని గ్రామ గ్రామాన పర్యటిస్తూ ధర్మపరిరక్షణ సమితులను ఏర్పాటు చేయటం, రకరకాల ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞాలు, ధార్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తూ హిందువులలో ఐక్యతనూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. ఒడిషా రాష్ట్రంలో పూరీ జగన్నాథ రథ యాత్ర ప్రతి గ్రామంలో జరపటం ఆనవాయితీ. మతమార్పిడి వ్యాపారంలో ఆరితేరిన క్రైస్తవ చర్చి, దాని ప్రేరితమైన కొందరు అధికారులు, గూండాలు చాలా గ్రామాల్లో ఈ ఉత్సవాన్ని అడ్డుకున్నారు. స్వామీజీ పిలుపు మేరకు హిందుత్వ వాదులైన యువత ముందుకు వచ్చి అనేక గ్రామాల్లో భారీ ఎత్తున జగన్నాథ రథ యాత్రను పునః ప్రారంభించారు.