News

అనుమతులున్నా.. తిరంగా ర్యాలీని అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ సాదిక్

265views

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు నిర్వహిస్తున్న ర్యాలీని హెడ్ కానిస్టేబుల్ సాధిక్ అడ్డుకున్నారు.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది. ఎస్సై దగ్గర అనుమతి తీసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నా… ఏమాత్రం పట్టించుకోకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ర్యాలీని అడ్డుకున్నారు. అంతేకాకుండా పాటలు కూడా ఆపేయాలంటూ హెడ్ కానిస్టేబుల్ బెదిరింపులకు దిగారు.

మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి 500 అడుగుల జాతీయ త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్వయంగా ఎస్సై ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా దేశ భక్తి గీతాలు వినిపిస్తూ ర్యాలీ సాగుతోంది. ఈ సమయంలోనే హెడ్ కానిస్టేబుల్ సాదిక్ అడ్డుకున్నారు. ఎందుకు రా… పాటలు పెట్టారు.. అనుమతులు ఉన్నాయా? ఆపేయండి.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పాటలు ఆపించి, వాహనాన్ని కూడా ఆపేశారు. తాము ఎస్సై వద్ద అనుమతులు తీసుకున్నామని యాజమాన్యం చెబుతున్నా.. వినడం లేదు. అలాగే పాత్రికేయులపై కూడా దురుసుగా ప్రవర్తించారు.