News

తాడేపల్లిలో వేద పాఠశాల

266views

కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలోని మలయాళ స్వాముల పెద్దాశ్రమంలో శృతి భారతి వేద పాఠశాలను ఏర్పాటు చేస్తు న్నట్టు జాతీయ సాంస్క్రిట్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గుళ్లపల్లి శ్రీరామ కృష్ణ మూర్తి తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావే శంలో కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఏర్పేడు పెద్దాశ్రమ పీఠాధిపతి సూచన మేరకు తాడేపల్లి పెద్దాశ్రమంలో వేదపాఠశాల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా భావిం చినట్టు తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు (ఆరు నెలలు), డిప్లొమో కోర్సు (ఏడాది), ప్రాక్ శాస్త్రి (రెండేళ్లు) కోర్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఘంటసాల గ్రామానికి చెందిన ఎస్ఆర్ఎ మూల్పూరి వెంకట్రావు సావిత్రి దంపతులు పాఠశాల ఏర్పాటుకు సహాయసహకారాలు అంది స్తున్నట్టు తెలిపారు.

పదోతరగతి చదివిన మాట్లాడుతున్న శ్రీరామ కృష్ణమూర్తి విద్యార్థులు అర్హులని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలోని గిరిజన పల్లెలోనూ వేద పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఎన్ఆర్ఎ మూల్పూరి వెంకట్రావు మాట్లాడుతూ, వేద పరిజ్ఞానాన్ని విస్తృత పర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. సమష్టి కృషితో వేదపాఠశాల కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్ర మంలో జాతీయ సాంస్క్రిట్ యూనివ ర్సిటీ నోడల్ ఆఫీసర్ జాన్ంజన్ పాండా, జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రె పాటి వెంకటరామకృష్ణ, ఆశ్రమ నిర్వాహకులు కావూరి కోదండ రామయ్య, కొత్త పల్లి పీఏసీఎస్ చైర్పర్సన్ గొర్రెపాటి సురేష్, మొవ్వ శ్రీరామ్మూర్తి, మూల్పూరి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.