
ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ నగరంలోని కల్నల్‌గంజ్ ప్రాంతంలో లవ్ జిహాద్‌కు సంబంధించిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది. తసుబ్ అలియాస్ ఒవైస్ అనే ముస్లిం యువకుడు ఫతేపూర్ నుండి 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికను అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ వారిద్దరూ పట్టుబడడంతో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. వివరాల్లోకి వెళితే కల్నల్ గంజ్ ప్రాంతంలో నివసించే అమ్మాయికి, తనను తసుబ్‌గా పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానంటూ తన మాయమాటలతో ఆ అమ్మాయిని వలలో వేసుకున్నాడు.
ఆ అమ్మాయిని “లేచిపోదాం..” అంటూ ప్రోత్సహించి చివరికి ఓ రోజు ఆమె కుటుంబం అంతా నిద్రపోతున్న సమయంలో తెల్లవారుఝామున ఆ అమ్మాయిని ఆ యువకుడు తీసుకుని కాన్పూర్‌లోని ఝార్కటి బస్టాండ్‌కు తీసుకువచ్చాడు. అక్కడ నుంచి వారిద్దరూ అహ్మదాబాద్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు ఆటోలో వెళుతుండగా వీరి సంభాషణను విన్న ఆటో డ్రైవర్ వెంటనే అనుమానంతో తెలివిగా వ్యవహరించి భజరంగ్ దళ్ కార్యకర్తలకు సమాచారమిచ్చి, ఆటోను నేరుగా కల్నల్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే ఆ యువకుడు మొదట హిందూ పేరు చెప్పి, క్రమంగా బాలికను తప్పుదారి పట్టించి తనతో తీసుకెళ్లడానికి సిద్దమయ్యాడని.
అయితే, తమ కూతురు ఇంటి నుంచి వెళ్లినప్పుడు ఎవరికీ తెలియకపోవడంతో, బహుశా మొత్తం కుటుంబానికి నిద్రమాత్రలు తినిపించి ఉండవచ్చునని బాలిక తండ్రి ఆందోళన వ్యక్తం చేశాడు. గతంలో కూడా ఈ విషయంపై కూతురితో గొడవ జరిగిందని, అతను మంచివాడు కాదని ఒప్పించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆమె తాసుబ్‌ను సమర్థిస్తూ వచ్చిందని బాలిక తండ్రి చెప్పాడు. ఈ విషయం ఇంతదాకా వెళుతుందని తాను అనుకోలేదని అయితే చివరికి తనంత తానుగా ఆ అమ్మాయి నిజాన్ని తెలుసుకోవడం మంచిదే అయిందని అన్నాడు.





