News

కుంకుమ తుడిచేసుకొనే రావాలి : హిందూ ఉద్యోగికి బెదిరింపులు

279views

బక్రీద్ సందర్భంగా ముంబైలోని భండూప్ వెస్ట్ ప్రాంతంలో ఓ హిందువుకి తీవ్ర అవమానం ఎదురైంది. క్రోమా దుకాణంలో పనిచేసే రషీద్ అనే ఉద్యోగి మరో ఉద్యోగి జితేష్ శర్మని కుంకుమ తీసేయని తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. కుంకుమ తీసేయని పక్షంలో బయటికి వెళ్లిపోవాలని కూడా బెదిరించినట్లు తెలుస్తోది.

ఈ ఘటన బయటికి రావడంతో హిందూ సంఘాలు క్రోమా దుకాణానికి చేరుకున్నాయి. దీనిపై జవాబు చెప్పాల్సిందేనని క్రోమ్ మేనేజర్ ని నిలదీశాయి. వెంటనే జితేష్ శర్మకి రషీద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రషీద్ అనే ఉద్యోగి ప్రవర్తన బాగో లేదని, వెంటనే అనిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఈ సమయంలో క్రోమా దుకాణ యాజమాన్యానికి, హిందూ సంఘాలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై నెటిజన్లు స్పందించారు. కుంకుమను తుడిచేయాలన్న రషీద్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఈ స్టోర్ భారత్ లో వుంది. విదేశాల్లో లేదు. కుంకుమను తుడిచేయాలనడానికి రషీద్ కి ఎంత ధైర్యం? వెంటనే శిక్షించాలి’’ అని ఓ నెటిజన్ నిలదీశారు.

‘‘రషీద్ పై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి. ఈ ఘటన సిగ్గు చేటు, ఆమోదయోగ్యం కానేకాదు’’ అని మరో నెటిజన్ అన్నారు.