News

ఒంగోలులో ఉగ్రదాడి మృతులకు మాజీ సైనికుల నివాళి

254views

జమ్ముకశ్మీర్ లోని పపహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడి అమానుషమని మాజీ సైనికులు ఖండించారు. ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన యాత్రికులకు నివాళిగా మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాజీ సైనికలు భారత్ మాతాకీ జై…వందేమాతరం…పాకిస్దాన్ డౌన్ డౌన్…ఉగ్రదాడులను ఖండించాలి…అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు స్టేట్ ఫెడరేషన్ అధ్యక్షుడు నెప్పలి నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ, పాకిస్తాన్ చేసిన ఈ ఉగ్రదాడిని మక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే దాడికి స్పందనగా తీవ్రమైన చర్యలు చేపట్టారని చెప్పారు. పాకిస్దాన్ తో సింధూ జలాల ఒప్పందం రద్దు, పాకిస్దాన్ జాతీయుల వీసాల రద్దు, పాకిస్దాన్ ఎంబసీ మూసివేత వంటి కఠినచర్యలు తీసుకున్నారన్నారు. యుద్దం ఎప్పుడు వచ్చినా మాజీ సైనికులు రంగంలోనికి దిగడానికి సిద్దంగా ఉన్నారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గెం శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉగ్రవాదులు చేసిన ఈ దుశ్చర్యను జాతీ యావత్తు ఖడిస్తోందన్నారు. మతం పేరుతో ఇటువంటి దాడులకు పాల్పడటం దారుణమన్నారు.