News

మే 4 నుంచి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

458views

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారిని కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఆరాధిస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. మే 4న శేషవా హనోత్సవం, 5న గజవాహనం, 6న నరనంది ఉత్సవం, 7న దీక్షబంధనాలంకారోత్సవం, 8న బ్రహ్మరథోత్సవం, రాత్రివేళ గజవాహనోత్సవం, 9న మహా ప్రసాద వినియోగం ఉంటాయి. ఈ వార్షికోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు తరలి వస్తారు. మెదక్ జిల్లా రేగోడ్ గ్రామ శివారులోని మఠంలోనూ ఉత్సవాలు జరుగుతాయి. కందిమల్లాయపల్లెలోని బ్రహ్మంగారి నివాసాన్ని, మఠంలో సమాధిని, ఆయన వెలిగించిన అఖండజ్యోతి, కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలను దర్శించుకోవచ్చు. 1608లో జన్మించిన స్వామి 1693లో వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవసమాధి చెందారు.

ఎలా చేరుకోవచ్చు..
బ్రహ్మంగారిమఠం కడపకు సుమారు 60 కి.మీ. దూరంలో ఉంది. కడప నుంచి బస్సులూ, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఉత్సవాల సమయంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైదుకూరు, పోరుమామిళ్ల, బద్వేలు, ప్రకాశం జిల్లా గిద్దలూరుల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది.