News

రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

448views

కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి , భాజపా నాయకుడు యడియూరప్ప కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. మంత్రాలయం చేరుకున్న వీరు శ్రీమఠం పద్మనాభ తీర్థ అతిధిగృహంలో బస చేశారు. అనంతరం శ్రీమఠం చేరుకున్న వీరికి మఠం అధికారులు స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మకు మంగళ హారతులు సమర్పించిన అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొన్నారు. పీఠాధిపతి సుదేంద్ర తీర్థులు ఆశీర్వదించారు. అనంతరం జూన్ 7, 8 తేదీలలో బెంగళూరులో జరగనున్న సుభాష్ శ్రవణ వివాహానికి హాజరుకావాల్సిందిగా యడియూరప్ప కుటుంబసభ్యులు పీఠాధిపతిని ఆహ్వానించారు.

రాఘవేంద్ర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు..
వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు మంత్రాలయానికి తరలివచ్చారు. ప్రధాన వీధులు, అయోధ్య రామయ్య సర్కిల్, రాఘవేంద్ర కూడలి, మఠం మధ్వ కారిడార్, ఎంటీఆర్ కారిడార్, తుంగభద్రా నది తీరం, కల్పవృక్ష కాంప్లెక్స్, శ్రీ నికేతన్ కాంప్లెక్స్, అన్నపూర్ణ భోజనశాల, సంత మార్కెట్ తదితర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి.