News

టీటీడీ గోశాలలో గోవుల మృతి అవాస్తవం: టీటీడీ

345views

టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు అవాస్తవం అంటూ టీటీడీ ఖండించింది. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని ఒక ప్రకటనలో పేర్కొంది. మృతి చెందిన గోవులు ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు ఫొటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడి ఖండిస్తోందని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతోంది. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు, సోషల్‌ మీడియా వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్వీ గోశాలపై దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు.