
267views
విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఈనెల 12న వీర హనుమాన్ విజయ శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిలేటి తెలిపారు. బుధవారం వినాయక్ ఘాట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలోపాసన దివస్‌ను పురస్కరించుకొని హిందు బంధువులను సంఘటితం చేయడానికి వీర హనుమాన్ శోభాయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఓల్డ్ సిటీలోని లలితాపీఠం వద్ద శోభాయాత్ర ప్రారంభమై స్వామి వివేకానంద కూడలి (రాజ్‌విహార్ సర్కిల్), శ్రీకృష్ణ దేవరాలయ సర్కిల్ మీదుగా బుధవార పేట సాయి సీతారామంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అమరసింహా రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు మాట్లాడారు.





