News

వీరభద్రాలయ ప్రాముఖ్యంపై ప్రాథమిక నివేదిక

297views

లేపాక్షి వీరభద్రాలయ సముదాయానికి ఐక్యరాజ్యసమితి వారి యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో శాశ్వతంగా చోటు సంపాదించడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని తెలుపుతూ ఒక ప్రాథమిక నివేదికను చరిత్రకారుడు మైనాస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబునాడుకు అందజేశారు. అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన చరిత్రకారుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా యునెస్కోతో సంప్రదింపులు జరపడానికి వెంటనే ఒక నిపుణుల కమిటీని నియమించాలని కోరారు. ఆసియాలోనే అతిపెద్దదైన వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం, ప్రపంచంలోనే పెద్దదైన ఏకశిలా నంది విగ్రహం, నేలను తాకని వేలాడేస్తంభం ఇలా ఆలయంలోని ఎన్నో చారిత్రక నేపథ్యం కలిగిన ఛాయా చిత్రాలను చరిత్రకారుడు ముఖ్యమంత్రికి వివరిస్తూ ప్రాథమిక నివేదికను అందించారు. లేపాక్షి ఆలయ సముదాయానికి యునెస్కో గుర్తింపు తీసుకు రావడానికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు అతను తెలిపారు. యునెస్కో జాబితాలో చోటుదక్కితే ఆ ప్రాంత రూపురేఖలు సమూలంగా మారిపోవడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.