News

వామపక్ష వాదులతో హిందువులకు ప్రమాదం

235views

వామపక్షాలు, ఉదారవాదులతోనే హిందూ సమాజానికి అతిపెద్ద ప్రమాదమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జరిగిన వివేకానంద సేవా సమ్మాన్‌ 2025 కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింలు, క్రైస్తవులు ఎన్నడూ హిందూ సమాజానికి ప్రమాదం కాదన్నారు. హిందువులే తమ సమాజాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ‘‘వామపక్షాలు, ఉదారవాదులతోనే బెంగాల్‌లో హిందుత్వం బలహీనత ప్రారంభమైంది. హిందువులు అంతరించిపోతారని రాహుల్‌గాంధీ, మమత భావిస్తున్నారు. ఎన్నో నాగరికతలు వచ్చి పోయాయి. కానీ హిందూ నాగరికత ఇప్పటికీ అలాగే ఉంది. ఎప్పటికీ ఉంటుందన్న విషయాన్ని వారు గుర్తించాలి. అస్సాంలో హిందువుల సంఖ్య 58శాతానికి తగ్గిపోతే.. బెంగాల్‌లో 65శాతంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.