News

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర..

303views

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పేరుతో విజయవాడ ఐఆర్‌సీటీసీ సంస్థ ప్రత్యేక ప్యాకేజీతో భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలును నడపనుంది. మార్చి 21న సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించి 29న తిరుగు ప్రయాణమవుతుంది. అల్పాహారం, భోజనం, రవాణా, హోటల్‌ గదులతో కలిపి టికెట్‌ ధర స్లీపర్‌ తరగతి రూ.14,250, థర్డ్‌ ఏసీ 21,880, సెకండ్‌ ఏసీ రూ.28,440 అని విజయవాడ ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. ఇతర వివరాల కోసం ఫోన్‌ నంబరు 92814 95848లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.