News

కుంభమేళాకు దంపతుల పాదయాత్ర

281views

మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి భక్తజనం వస్తున్నారు. రూపేన్‌దాస్‌ (58), పతీ రాణి దంపతులు ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి నేపాల్‌ నుంచి పాదయాత్రగా బయలుదేరారు. రూపేన్‌దాస్‌ వెనక్కు తిరిగి నడుస్తుండగా, భార్య ఆయనకు ఎదురుగా ఉండి వచ్చే వాహనాల గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. వీరు నేపాల్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు, అక్కడి నుంచి అయోధ్యకు ఇలాగే పాదయాత్రగా చేరుకున్నారు. అయోధ్య నుంచి ప్రయాగ్‌రాజ్‌ దిశగా కదులుతున్నారు. నేపాల్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ 500 కి.మీ. కంటే ఎక్కువ దూరం ఉంటుందని, సనాతన ధర్మం గురించి ప్రచారం చేయాలనే లక్ష్యంతో ఇలా పాదయాత్ర చేస్తున్నట్లు వారు తెలిపారు.