
222views
ఆర్జీకర్ హాస్పిటల్ హత్యాచారం బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబీకులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తో భేటీ అయ్యారు. తమకు న్యాయం చేయాలని, అసలు విషాదం ఎలా జరిగిందో వారు వివరించారు. అలాగే మహిళల భద్రతకి సంబంధించిన సమస్యలపై కూడా చర్చించారు. ప్రస్తుతం మోహన్ భాగవత్ పది రోజుల పాటు కలకత్తా పర్యటనలో వున్నారు. ఈ సందర్భంగానే బాధిత కుటుంబం భేటీ అయ్యింది.
భేటీ అనంతరం కుటుంబీకులు మాట్లాడుతూ ‘‘మేము ఉదయం 11 గంటలకు మోహన్ భాగవత్ తో భేటీ అయ్యాం. అరగంట పాటు సమావేశం జరిగింది. జరిగిన విషయాలన్నీ వారికి తెలియజేశాం. విషయం తెలుసు కానీ… మొత్తం తెలియదన్నారు. దీంతో అంతా తెలియజేశాం. మాకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. మాకు ఎవరిపై అయితే అనుమానాలు వున్నాయో.. వారి పేర్లు కూడా చెప్పాం. ఓ లేఖ కూడా సమర్పించాం’’ అని బాధిత కుటుంబం పేర్కొంది.





