News

మహా కుంభమేళా @ 40 కోట్లు

349views

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమం వద్ద జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి 40 కోట్లు దాటినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల మంది భక్తులు విచ్చేయగా.. అత్యధికంగా మకర సంక్రాంతికి 3.5 కోట్లు, మౌనీ అమావాస్యకు 8 కోట్లు, వసంత పంచమి వేళ 2.57 కోట్లమంది అమృత స్నానాలు చేసినట్లు వివరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు ఇప్పటికే కుంభమేళాను సందర్శించి పూజాదికాలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 10వ తేదీన (సోమవారం) త్రివేణీసంగమానికి విచ్చేయనున్నట్లు రాష్ట్ర సర్కారు వెల్లడించింది.