News

సేవాలాల్‌ జయంత్యుత్సవాలకు సంపూర్ణ సహకారం

409views

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం ఉంటుందని ట్రస్ట్‌ సభ్యులకు
అనంతపురం జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ భరోసానిచ్చారు. సంత్‌ సేవాలాలా మహరాజ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ రూపొందించిన సేవాలాల్‌ 286వ జయంతి మహోత్సవాల పోస్టర్లను కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయన విడుదల చేశారు. అనంతరం ఆహ్వాన పత్రికను కలెక్టర్‌కు ట్రస్ట్‌ సభ్యులు అందించి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు అశ్వత్థ నాయక్‌, ప్రధాన కార్యదర్శి బాలానాయక్‌, కోశాధికారి బానోత్‌ చక్రేనాయక్‌, ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలాజీనాయక్‌, ఏఐబీఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రంగానాయక్‌, పూజారి రంగలాల్‌నాయక్‌, ఎం.శివశంకర్‌, సభ్యులు పాల్గొన్నారు.