News

అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ, మహా కుంభాభిషేకం

282views

కాశీలోని భగవతి అన్నపూర్ణేశ్వరి ఆలయంలో శుక్రవారం జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ, మహా కుంభాభిషేక కార్యక్రమాలు జరిగాయి. ప్రసిద్ధ విశ్వనాథ ఆలయం పక్కనున్న శ్రీ అన్నపూర్ణేశ్వరి మందిరానికి శృంగేరి మఠం ఈ కొత్త విగ్రహాన్ని అందజేసింది. క్రోధి సంవత్సర మాఘ శుక్ల దశమి సందర్భంగా వేద మంత్రోచ్చారణల నడుమ భక్తుల సమక్షంలో చారిత్రక క్రతువును నిర్వహించారు. శ్రీ అన్నపూర్ణేశ్వరికి శృంగేరి మఠం తరఫున స్వర్ణ శిఖర గోపురం సమర్పించి, కుంభాభిషేకం చేశారు. జనవరి 31న మొదలై ఫిబ్రవరి 9వ తేదీతో ముగిసింది. ఈ మహాకుంభాభిషేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా సహస్ర చండీ మహాయజ్ఞం, కోటి కుంకుమార్చన, మహారుద్ర యజ్ఞం, నాలుగు వేదాల పారాయణం, 18 పురాణాలు.. శ్రీమద్‌ వాల్మీకీ రామాయణ పఠనం చేశారు. మానవకోటి కల్యాణం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది వేద పండితులు పాల్గొన్నారు.