News

అయోధ్య శేషావతార ఆలయ ధ్వజారోహణం..

3views

అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శేషావతార ఆలయ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 11 మంది సాధు సంతులు హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 4,000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్నోలో జరిగిన హృదయ విదారక అగ్నిప్రమాదంలో మరణించిన వారి ఆత్మశాంతి కోసం మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ శ్రీరామ లల్లా వద్ద ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మహంత్ శశికాంత్ దాస్ జీ మహారాజ్,జియానీ గుర్జీత్ సింగ్ జీ, మహంత్ రామానంద్ దాస్ జీ మహారాజ్, జగద్గురు రామ్దినేశాచార్య జీ మహరాజ్, దినేంద్ర దాస్ జీ మహారాజ్, జే మహంత్ రాంకుమార్ దాస్, మహంత్ రఘుబీర్‌శరణ్ జీ మహారాజ్,రాజ్‌కుమార్ దాస్ జీ మహారాజ్, మహంత్ గిరీష్ దాస్ జీ మహారాజ్, మహంత్ అవధేష్ దాస్ శాస్త్రి జీ మహారాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా, శ్రీ రామునికి సంబంధించిన ఒక ప్రాచీన తాళపత్ర గ్రంథాన్ని కూడా మ్యూజియానికి అందజేశారు. కార్యక్రమం ముగింపు తర్వాత భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.