News

హైదరాబాద్ లో మహిళా భక్త సమ్మేళనం

310views

ఆధునిక మహిళ శారదమ్మ బాటలో పయనించేలా ప్రేరేపించే సంకల్పంతో దక్షిణ భారత రెండవ మహిళా భక్త సమ్మేళనం నిర్వహిస్తున్నారు. గుంటూరు రామకృష్ణ శారదా మిషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు శ్రీ మా శారదా మహిళా భక్త సమ్మేళనం శంషాబాద్ (హైదరాబాద్) కన్హ శాంతి వనంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతుంది. ఈ సమ్మేళనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా భక్తులు విరివిగా పాల్గొనాలని ప్రవ్రాజిక భవానీ ప్రాణ మాతాజీ కోరారు. ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా కోల్ కతా రామకృష్ణ శారదా మిషన్ ప్రధాన కార్యదర్శి పరివ్రాజిక అతంద్రప్రాణ మాతాజీ, గౌరవ అతిథిగా ఐపీఎస్ అధికారిణి సౌమ్యా మిశ్రా హాజరవుతారని తెలిపారు.