News

మహా కుంభమేళాకు ఏపీటీడీసీ బస్‌

238views

ఉత్తరప్రదేశ్‌­లోని ‘మహా కుంభమేళా’కు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. ఫిబ్ర­వరి 11, 12 తేదీల్లో రెండు రూట్లలో భక్తుల సౌకర్యార్థం సర్వీసులు నడుపుతోంది. దీన్లోభాగంగా 11వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి, 12వ తేదీ నెల్లూరు నుంచి సర్వీసులను ఏర్పాటు చేశారు.

అయితే యాత్రల దర్శనం, టిఫిన్, భోజన ఖర్చులను ప్రయాణికులే భరించాలని ఏపీటీడీసీ ఓ ప్రకటనలో తెలిపింది. రిజర్వేషన్‌ కోసం www.aptdc.in, tourism.­ap.­gov.in వెబ్‌సైట్లను, ఏపీటీడీసీ సీఆర్‌వో కార్యాలయం, అధీకృత ఏజెంట్లను సంప్రదించాలని సూచించింది.

రూట్‌–1: తిరుపతి, ఒంటిమిట్ట, కడప బైపాస్, ఓర్వకల్లు, కర్నూలు బైపాస్, హైదరాబాద్, జబల్‌పూర్, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, కాశీ, నాగపూర్, ధర్మపురి మీదుగా ఉంటుంది.
రూట్‌–2: నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణా­ర్క్, భువనే­శ్వర్, కటక్, చంఢీ­పూర్, గయా, బుద్ధగయా, కాశీ, ప్ర­యా­గ్‌రాజ్‌ వెళ్లి తిరు­గు ప్రయాణంలో శ్రీకూర్మం, అరసవెల్లి, విజయవాడ మీదుగా నెల్లూరు.