News

ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి

369views

మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు జిల్లాల సీనియర్ పోలీసు అధికారులు, జిల్లా పరిపాలన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు.

ప్రతి భక్తుని రక్షణ బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. మహా కుంభమేళా ప్రాంతంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల భద్రత, సౌలభ్యం కోసం చేసిన ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి అయోధ్య, వారణాసి, మీర్జాపూర్, చిత్రకూట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అయోధ్య-ప్రయాగ్‌రాజ్, కాన్పూర్-ప్రయాగ్‌రాజ్, ఫతేపూర్-ప్రయాగ్‌రాజ్, లక్నో-ప్రతాప్‌గఢ్-ప్రయాగ్‌రాజ్, వారణాసి-ప్రయాగ్‌రాజ్ తదితర మార్గాల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.