
391views
ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్నిఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుంచి వాహన రహిత ప్రాంతం -నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య రోజున భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దీని పర్యవేక్షించడానికి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఇది ఇలా ఉండగా కేంద్ర హోం మంత్రి శాఖ అమిత్ షా మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని ప్రయోగరాజ్ ను సందర్శిస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మిక వేత్తలతో అమిత్ షా సమావేశమైవుతారని అధికారులు తెలిపారు.





