News

సంభాల్ లో మరో బావి వెలుగులోకి… మసీదుకి 30 మీటర్ల దూరంలోనే

192views

యూపీలోని సంభాల్ మసీదు దగ్గర మరో ప్రాచీన బావి తాజాగా వెలుగులోకి వచ్చింది. మట్టితో మూసేసిన ఈ బావిని స్థానిక అధికార యంత్రాంగం వెలికితీయడం ప్రారంభించింది. షాహీ జామా మసీదు, హరిహర మందిరం ప్రాంతానికి ఈ బావి 30 మీటర్ల దూరంలోనే వుండటం విశేషం. కొన్ని రోజుల నుంచి సంభాల్ ప్రాంతంలో అనేక బావులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.

అయితే… తాజాగా బయట పడిన బావి దగ్గర గతంలో పూజలు జరిగేవని స్థానికులు పేర్కొన్నారు. పిల్లలు పుట్టిన సమయంలో, పెళ్లిళ్ల సమయంలో, ఇతర పండుగల సమయంలో భక్తులు ఇక్కడి వచ్చేవారని వెల్లడించారు. తర్వాత కాలంలో దుండగులు ఈ బావిని ఆక్రమించుకొని, స్వరూపాన్నే మార్చేశారన్నారు. కానీ నిజం ఎప్పుడో ఒకప్పుడు బయట పడటం ఖాయమని, ఇప్పుడు బావి మళ్లీ బయటపడిందని సంతోషం వ్యక్తం చేశారు.

మరోవైపు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ సహకారంతో అన్ని బావులు, గుడులను సుందరంగా తీర్చిదిద్దే పనులు చేపడతామని డీఎం తెలిపారు. నీటి సంరక్షణ, పుణ్య క్షేత్రాల కోసం వీటిని సుందరంగా చేస్తామని అధికారులు కూడా ప్రకటించారు. మరోవైపు ఈ బావి వున్న పరిసర ప్రాంతాల్లో వుండే దుకాణాలను కూడా కూల్చేశారు. వాటిని మున్సిపల్ బృందం తొలగించింది.