
264views
వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి హిందూ అధ్యయనంలో పరిశోధనలు ప్రారంభించాలని ఢిల్లీ విశ్వ విద్యాలయం నిర్ణయించింది. స్థాయి సంఘం ఈ మేరకు ప్రతిపాదించింది. సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ పాలక మండలి పీహెచ్.డీ. కార్యక్రమాన్ని సిఫారసు చేసింది. మొదట ఈ విద్యా సంవత్సరం నుంచే ఆ పీహెచ్.డీ. కార్యక్రమం ప్రవేశపెట్టాలని అనుకున్నారు. హిందూ స్టడీస్ జాయింట్ డైరెక్టర్ ప్రేమా మల్హోత్రా ఈ వివరాలు తెలియచేశారు. విశ్వవిద్యాలయంలో హిందూ అధ్యయన విభాగం 2023లో ప్రారంభించారు. ప్రస్తుతం రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్ అందుబాటులో ఉంది. తొలి విడత విద్యార్థులు మొదటి సంవత్సరం పూర్తిచేశారు. ఆర్ష వాఙ్మయం ఇక్కడ బోధిస్తారు..





