
మహా కుంభమేళా దగ్గరపడుతోంది. ఇప్పటికే వివిధ అఖారాలకు చెందిన సాధువులు కూడా చేరుకుంటున్నారు.ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది. మహా కుంభమేళాలో పవిత్ర వాతావరణాన్ని, దైవిక వాతావరణాన్ని పెంచడానికి భారతీయ పురాణాల ప్రకారం పేర్లన్న 30 ద్వారాలను ఏర్పర్చనుంది. దేవలోకం ప్రవేశించినట్లే అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేశారు. పవిత్ర స్నానాలు చేసే సమయంలో సముద్ర మంథన్ నుంచి 14 రత్నాలతో వారికి స్వాగతం పలికేలా ఏర్పాట్లయ్యాయి. కచ్ఛప, నంది ద్వారాలతో పాటు శివుడి ఢమరుకం కూడా వుంటుంది. ఇలా మొత్తంగా 30 ద్వారాలు ఏర్పాటు చేశారు.
పౌరాణిక ఇతివృత్తాలను స్ఫూరక్తిగా తీసుకొని 30 తోరణాలను నిర్మించారు. యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన కళాకారులు ఈ మహత్తర తోరణాలకు జీవం పోశారు. అవిశ్రాంతంగా పనిచేశారు.
ఐరావత్, కామధేను ఆవు, కౌస్తుభ మణి, కల్పవృక్షం, రంభ అప్సర, మహాలక్ష్మి, చంద్రుడు, శరంగ్ విల్లు, శంఖం, ధన్వంతరి మరియు అమృతంతో సహా సముద్ర మంథనంలోని 14 రత్నాలు యాత్రికులకు చక్కగా అలంకరించబడిన ద్వారాల రూపంలో స్వాగతం పలుకుతాయి.
ఇందులో 100 అడుగుల పొడుగు, 50 అడుగుల ఎత్తుతో ఆకట్టుకునేలా భారీ నంది గేట్ అలాగే ఢమరుకం గేటు ప్రధాన ఆకర్షణ. అదనంగా, సముద్ర మంథన్ మరియు కచ్చప ద్వారాలతో సహా ప్రత్యేకంగా రూపొందించిన 30 ఇతర ఆర్చ్ గేట్లు గొప్ప పౌరాణిక ప్రతీకలను ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉట్టిపడేలా చేస్తున్నాయి.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహాకుంభాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక అద్భుతంగా ప్రదర్శించాలని భావించారు, ఇది యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.





