
బరేలీ ప్రాంతంలోని బిషారత్ గంజ్ లో అత్యంత విషాద ఘటన జరిగింది. షెడ్యూల్డ్ కులాలకి సంబంధించిన అంత్యక్రియలను ముస్లింలు అడ్డుకున్నారు. షెడ్యూల్డ్ కుటుంబానికి చెందిన ఓ వృద్ధుడు చనిపోతే.. హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయడానికే అనుమతించలేదు ముస్లింలు. ఆ వృద్ధుడి మృత దేహాన్ని తమ ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారమే ఖననం చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో ఏం చేయాలో ఆ కుటుంబానికి పాలుపోలేదు. చివరికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దగ్గరుండి హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు జరిగేలా చూశారు.
ఈ గ్రామంలో 650 వరకూ షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వుంటాయి. ఒకే షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వారుంటారు.మిగితా అందరూ ముస్లింలే. హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలనుకుంటే మరో ప్రాంతమైన రామ్ గంగాకి తీసుకెళ్లాలని, ఖననం చేయాలనుకుంటే మాత్రమే ఇక్కడ చేయాలంటూ ముస్లిం హుకూం జారీ చేశారు. చివరికి పోలీసుల జోక్యంతో హిందూ సంప్రదాయం ప్రకారమే దహన సంస్కారాలు జరిగాయి.





