NewsProgramms

హైందవ శంఖారావం సభలో విశ్వహిందూ పరిషత్ అఖిల భారతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ జీ ప్రసంగం

332views

హైందవ శంఖారావం సభలో విశ్వహిందూ పరిషత్ అఖిల భారతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ జీ ప్రసంగం:

  • ఇంత పెద్ద సభ హిందూ సమాజపు సామూహిక సంకల్పపు ఘోషణ. ప్రజాస్వామ్యంలో ఏం జరగాలో నిర్ణయించేది ప్రజలు.
  • అన్ని రాష్ట్రాల్లోనూ హిందూ మందిరాలను హిందూ సమాజానికి వాపసు ఇచ్చేయాలని ప్రజలు నిర్ణయించారు.
  • ఈ పద్ధతి రెండుమూడు వందల సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చింది. ఈస్టిండియా కంపెనీ పాలనలో ఈ పద్ధతి వచ్చింది.
  • అప్పట్లో తమిళనాడు, బెంగాల్‌లో కంపెనీ నివేదికల్లో దేవాలయాల గురించి ఉంది.
  • దేవాలయాల్లో గురుకులాలు ఉండేవి, విద్యాబోధన జరిగేది, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి, ప్రజలు ప్రతీ విషయాన్నీ ఆలయంలో నిర్ణయించుకునేవారు, పెళ్ళిళ్ళయినా, గొడవల పరిష్కారమైనా గుడిలోనే జరిగేవి. అంటే దేశంలోని వ్యవస్థ అంతా గుడుల మీద ఆధార పడి ఉండేది.
  • దక్షిణ భారతదేశంలో 10లక్షలకు పైగా ఎకరాల భూమిని దేవాలయాలకు దానాలుగా ఇచ్చారు.
    హిందూ సమాజపు ఏకతను దెబ్బతీయాలంటూ గుడుల పనితీరును నాశనం చేయాలని బ్రిటిష్ వారికి అర్ధమైంది.
  • ప్రభుత్వాలు మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, బౌధ్ధ, జైన మందిరాలు నిర్వహించవు, కానీ కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే నిర్వహిస్తాయి.
  • ఒకటి డబ్బుల లూటీ కోసం, రెండు హిందూ సంప్రదాయాలను నాశనం చేయడం కోసం.
  • కేరళ పద్మనాభస్వామి దేవాలయంలో గుడినుంచి బైటకు వెళ్ళేవారు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకని అడిగాను.
  • ఆలయంలోని ఒక్క ధూళికణం కూడా బైటకు వెళ్ళకూడదని రాజుగారి ఉద్దేశం అని అక్కడి వారు చెప్పారు. ఇప్పుడా సంప్రదాయం నశించిపోయింది.
  • ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ గుడీ తమ ఆదాయంలో ప్రభుత్వానికి భాగం ఇవ్వాలి. 5శాతం కామన్ గుడ్ ఫండ్ కు డబ్బులివ్వాలి. పన్నులు చెల్లించాలి, ఎక్కువ ధరకు విద్యుత్ బిల్లులు కట్టాలి.
  • అలా హిందూ ఆలయాల నుంచి వసూలు చేసిన డబ్బులను ప్రభుత్వాలు లౌకికవాదం పేరిట అందరికీ పంచాలి.
  • ఇతర మతాలకు దోచిపెట్టాలి. గుడిలో ఎలాంటి ఉద్యోగులుండాలి, ఎవరిని బదిలీలు చేయాలి వంటి నిర్ణయాలు కమిషనర్లు తీసుకుంటున్నారు. అది ధర్మాచార్యుల పని కదా. ప్రభుత్వాధికారులు ఎందుకు చేస్తున్నారు. ఆ విధంగా దేవాలయ వ్యవస్థలను బలహీనం చేస్తున్నారు.
  • అందుకే ఇప్పుడు హిందువులు అందరూ అడుగుతున్నారు. ఇంకా ఇది చెల్లదు. ఆలయాలను హిందువులకు వాపసు చేయాలి.
    కొంతమంది అడుగుతున్నారు.
  • 200 ఏళ్ళు గడిచిపోయాయి కదా, ఇప్పుడు ఆలయాలు ఎవరికి ఇవ్వాలి… విశ్వహిందూ పరిషత్‌కు ఇవ్వాలా? ఇది బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చడం కోసం జరుగుతున్న కుట్ర కాదా… అంటున్నారు.
  • కానీ నిజం చూస్తే రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో అర్చకులు బ్రాహ్మణులు కాదు. దేవాలయాలను స్థానిక ట్రస్టులు నిర్వహించాలి. అందులో అన్ని కులాలవారూ ఉంటారు.
  • ఆదాయ వ్యయాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. తిరుపతి గుడిలో రోజూ ఆదాయ వ్యయాలు లెక్కిస్తారు. కంచి మఠంలోనూ అంతే. కాబట్టి దేవాలయాల ఆస్తుల విషయంలో ట్రస్టులు జాగ్రత్తగా ఉండాలి.
  • ఇప్పుడు ప్రభుత్వాల చేతిలో ఉన్న గుడులను హిందూ సమాజానికి ఇవ్వాలి. దానివల్ల గుడులు వైభవంగా నిర్వహించబడతాయి.
  • 200 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా నిలువరించాలి. దానికి ఈ హైందవ శంఖారావం ప్రారంభం.
  • రామజన్మభూమి తరహాలో హిందూ సమాజం మొత్తం ఏకమై ఈ ఉద్యమాన్ని చివరివరకూ నిర్వహిస్తుంది. జై శ్రీరాం.