హైందవ శంఖారావం ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి
ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రసంగం
మన రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. ఈ జనసందోహాన్ని, ఈ జెండాల రెపరెపలనూ చూస్తే పండుగ ముందుగా వచ్చింది.
1987లో రాష్ట్రప్రభుత్వం దేవాలయాల ఉద్ధరణ కోసం అంటూ చట్టసవరణ చేసారు. దాని గురించి సౌందరరాజన్ గారు ‘చట్టం కోరల్లో దేవాలయాలు’ అనే పుస్తకం రాసారు. దానిలో, ప్రభుత్వం దేవదాయ ధర్మదాయ శాఖ అనే కొండచిలువను సృష్టించింది అని చెప్పారు.
చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం చేసిన మార్పులు హిందూ ఆలయ వ్యవస్థకు శరాఘాతంగా మారింది.
ప్రతీ హిందువు ఇంట్లో పూజామందిరం ఉంటుంది. మరి ప్రత్యేకంగా దేవాలయాలు దేనికి? అంటే ఇంట్లో పూజ వ్యక్తిగతం. గుడిలో పూజ సామాజికం. దేవాలయాలు హిందువుల అస్తిత్వం. అందుకే దాన్ని చెడగొట్టడం కోసమే ముష్కరులు ఆలయాలపై దాడులు చేసారు తప్ప నిధులు కొల్లగొట్టడం కోసం కాదు.
1987 చట్టం ద్వారా అర్చకులను గట్టి దెబ్బ తీసింది. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. హిందూ ధర్మాచార్యులు ఆ చట్టాన్ని వ్యతిరేకించారు.
ఆరుగురు సభ్యుల కమిషన్‌లో కేవలం ముగ్గురు సభ్యులతో చట్టాన్ని రూపకల్పన చేసారు. దాన్ని శాసనసభలో కేవలం నాలుగు గంటల నామమాత్రపు చర్చతో ఆమోదించి, చట్టరూపం తెచ్చారు.
అర్చకులను ఉద్యోగులుగా మార్చేసిన చట్టం అది. అర్చకులు ఉద్యోగులు కాదు, తమ దైవం సేవలో జీవితాన్ని గడిపేవారు. వారికి ఉద్యోగ విరమణ కల్పించడం అన్యాయం.
ఆ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీం కూడా అర్చకులకు అనుకూలంగా వ్యాఖ్యానించింది. సుప్రీం ఆదేశాలు నేటికీ పూర్తిగా అమల్లోకి రాలేదు.
మన రాష్ట్రంలో 20వేలకు పైగా గుడులకు ఆదాయం నామమాత్రం. 8 దేవాలయాల్లో మాత్రమే పెద్ద ఆదాయం. 1987 చట్టంతో మన దేవాలయాలపై గొడ్డలివేటు పడింది.
లౌకికవాదాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. అది మన అస్తిత్వానికి సమస్య కాలేదు, కారాదు.
బహు భారత్వం నిషేధం విషయంలో అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్...
లష్కరే తోయబా (LeT) ఉగ్రవాది, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నాయకుడు ఇమ్రాన్ లియాకత్ భట్టి భారత్కు వ్యతిరేకంగా తీవ్ర బెదిరింపులకు దిగాడు. దీనికి సంబంధించిన...
మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాసం ప్రారంభం సందర్భంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. నెలవారీ పూజల్లో భాగంగా...
సేవాఘఢ్: బంజారా, గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సేవాఘఢ్ నుంచి ఢిల్లీ వరకు భారత్ గోర్ బంజారా జోడో యాత్ర...
చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం.. 400 మందికి పైగా ఆయుర్వేద చికిత్సలు అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో విశ్వ ఆయుర్వేద...