News

దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం హైందవ శంఖారావం

354views

హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ హైందవ శంఖారావం సభను నిర్వహిస్తోందని గన్నవరం శాసనసభ సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, ఆదోని శాసన సభ్యులు పార్థసారథి తెలిపారు. కృష్ణాజిల్లా కేసరపల్లిలో ఆదివారం నిర్వహించనున్న సభ ఏర్పాటు పనులను ఆదోని శాసన సభ్యులు పార్థసారథి, విశ్వ హిందు పరిషత్ రాష్ట్ర కోశాధ్యక్షులు దుర్గా ప్రసాద్ రాజుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, సుమారు 30 ఎకరాల స్థలంలో సభను నిర్విస్తున్నామని చెప్పారు, హైందవ శంఖారావానికి 150 మంది స్వామీజీలు హాజరవుతారని తెలిపారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సభ దేవాలయాలను, దేవాలయ భూములను ఆస్తులను కాపాడే ముఖ్య ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, మాట్లాడుతూ, విశ్వహిందూ పరిషత్తు తరపున దేశంలో దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుకుంటూ హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను జనవరి 5 ,2025 న ఆదివారం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేవాలయాల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ, దేవాలయాల యొక్క పవిత్ర కాపాడుతూ ప్రజలను అప్రమత్తం చేయడానికి, ధర్మ రక్షణ కోసం ప్రజలు ఏ విధంగా పాల్గొనాలని తెలియజేయడానికి, దేవాలయాల స్వయం ప్రతిపత్తి ఉద్యమానికి నాంది పలకడం జరుగుతుందని తెలిపారు. సుమారు రెండు లక్షల మంది హిందూ బంధువులంతా ఈ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని, సుమారు 30 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను, పార్కింగ్ కోసం 150 ఎకరాలను సిద్ధం చేశామన్నారు.సభ కోసం సుమారు 5000 బస్సులు, 20వేల కార్లు, 10 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.