
298views
సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువూ సంఘటితం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణ కిషోర్ పిలుపునిచ్చారు. ఏలూరులోని స్థానిక దొండపాడులోని బాబా శివ అఘోరీజీ పీఠంలో రామం–రావణం సినిమా పేరును శివ అఘోరీజీ ఆవిష్కరించారు. వేదాలలో నిగూఢంగా ఉన్న విజ్ఞానాన్ని వెలికితీసి సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి రూ.వంద కోట్ల భారీ బడ్జెట్‌తో రామం–రావణం సినిమా నిర్మిస్తున్నట్లు నిర్మాత కావూరి లావణ్య తెలిపారు. చిత్రాన్ని విజయవాడకు చెందిన ప్రముఖ దర్శకుడు దాసరి సారధి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నామన్నారు. ఇప్పటికే కథ సిద్ధం చేసుకోగా నటీనటుల ఎంపిక కూడా 90 శాతం పూర్తయిందన్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.





