News

బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయంపై దాడి… విగ్రహాలు ధ్వంసం

303views

హిందువులపై నిత్యం దాడులు కొనసాగే బంగ్లాదేశ్ లో ముస్లిం ఛాందసుల రాక్షస క్రీడ కొనసాగుతూనే వుంది. తాజాగా… ఆంగ్ల నూతన సంవత్సరం రోజున ముస్లిం ఛాందసులు మరో హిందూ దేవాలయంపై దాడికి దిగారు. మౌల్వీ బజార్ జిల్లాలోని శ్రీ గౌరంగ్ మహాప్రభు సేవాల ఆశ్రమంలోని దేవాలయంలోకి బలవంతంగా ప్రవేశించిన ముస్లిం ఛాందసులు.. అక్కడి దేవతా విగ్రహాలను పగలగొట్టారు. అక్కడే వున్న పూజా వస్తువులను ఎత్తుకెళ్లారు. హిందువులకు, మైనారిటీలకు, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ ఘటనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పోలీసు శాఖ కూడా అత్యంత ఉదాసీనంగానే వుండిపోయింది. ఈ విషయాన్ని హిందూ వాయిస్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేయలేదు.

బంగ్లాదేశ్ లోని హిందూ దేవాలయాలపై దాడులు జరగడం కొత్తేమీ కాదు. గత నెల డిసెంబర్ ఏడో తేదీన ఢాకాలోని ఇస్కాన్ దేవాలయంపై ముస్లిం ఛాందసులు దాడి చేశారు. ఆలయానికి నిప్పు పెట్టారు. దీంతో కృష్ణ, లక్ష్మీనారాయణుల విగ్రహాలు కాలిపోరాయి. అదే విధంగా డిసెంబర్ 4 న సునమ్ గంజ్ జిల్లాలోని హిందూ దేవాలయంపై కూడా దాడి చేసి, ఇళ్లకు నిప్పు పెట్టారు ఛాందసులు.నవంబర్ 29న కూడా ఛత్రగ్రామ్ జిల్లాలోని బసుదేవ్ ముకుంత ఆలయంపై ముస్లిం మత ఛాందసవాదులు దాడి చేశారు. అయితే, హిందువులు ముందుకు రావడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు.