News

హైందవ సభ ప్రాంగణం వద్ద భద్రత ఏర్పాట్లు

468views

కృష్ణాజిల్లా కేసరిపల్లి గ్రామంలో జనవరి 5న హైందవ శంఖారావం మహాసభ ప్రారంభం కానుందని ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ తెలిపారు. హైందవ సభ ప్రాంగణం వద్ద భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. ఐ జి అశోక్ కుమార్ మాట్లాడుతూ, విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించామని ప్రయాణికులు గమనించి మళ్లించిన రూట్‌లో వెళ్లాలని సూచించారు. కేసరపల్లిలో జరిగే సభ ను 3000 మంది పోలీసు సిబ్బంది తో ఘట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు.

ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 150 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసి పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేవారు.. రామవరప్పాడు ఫ్లైఓవర్ మీదుగా ముస్తాబాద్, సూరంపల్లి, అండర్ పాస్ ద్వారా కొత్త బైపాస్ రోడ్డుకు రావాలి. అక్కడి నుంచి బీబీ గూడెం అండర్ పాస్ ద్వారా, గన్నవరం చైతన్య స్కూల్ జంక్షన్ వద్ద ఎన్ హెచ్ 16కు రావాలి. అక్కడినుండి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలి. సంబంధిత పత్రాలు ఉంటేనే ఈ మార్గంలో అనుమతిస్తామని తెలిపారు.