News

తెలుగు భక్తుల కోసం భూమి కేటాయించండి

222views

అయోధ్య, వారాణసీ పుణ్యక్షేత్రాల్లో తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఉపయోగపడేలా తెలుగు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. లక్నోలోని సీఎం నివాసంలో ఆయనను ఎంపీ కలిశెట్టి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాధవనాయుడు కలిసి ఈమేరకు వినతిపత్రం ఇచ్చారు. అయోధ్య రామమందిరం సమీపంలో తెలుగు భక్తుల వసతి ఆహార అవసరాలను తీర్చడానికి భవన నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరారు.