
విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంఖారావ కార్యక్రమంలో పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్-వీహెచ్‌పీ ప్రతినిధులు ఎమ్మెల్యే లోకం నాగమాదవిని కోరారు. ఈ మేరకు విజయనగరం జిల్లా ముంజేరులోని తన నివాసంలో ఆమెను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణల నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. హిందు దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తిని చేసి, స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఒక జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నాగమాధవి వీహెచ్‌సీ ప్రతినిధులతో కలిసి శంఖారావ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ ప్రతినిధులు శ్రీనివాస్, నాగరాజుశర్మ, బూర్ల శ్రీధర్, మురళీకృష్ణ, సీతారాములు, త్రినాధ్‌శ్రీకృష్ణ, బ్రహ్మాజీ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.





