News

మహా కుంభమేళాకు ఉచిత రైలు ప్రచారం అవాస్తవం

243views

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జనవరి 14 నుంచి జరగనున్న మహాకుంభమేళాకు రైల్వే శాఖ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుందని జరుగుతున్న ప్రచార ం పూర్తి అవాస్తవమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అవన్నీ తప్పుడు ప్రచారాలని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. టికెట్‌ లేకుండా రైలు ప్రయాణాలు చేస్తే నిబంధనల మేరకు చర్యటు తీసుకుంటామని వెల్లడించింది. అయితే మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది.