News

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ఠ వార్షికోత్సవం కోసం కమిటీ ఏర్పాటు

281views

అయోధ్యలోని బాల రామయ్య దేవాలయంలోని ఐదు మంటపాలలో ఒకటైన రంగ మండప శిఖరం ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇది ఆలయంలో ముఖ్యమైన భాగం. ఇప్పటి నుంచి సరిగ్గా ఒక నెల అంటే జనవరి 11, 2025న.. రామ మందిర ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాన్ని ‘ప్రతిష్ఠ ద్వాదశి’ని ఘనంగా జరుపుకోనున్నట్లు తెలియజేసారు.

అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనుల్లో ఐదు మంటపాలలో రంగ మండప శిఖరం పూర్తిగా సిద్ధమైంది. ‘ప్రతిష్ఠ ద్వాదశి’ రోజున మొదటి వార్షికోత్సవ వేడుకల కోసం ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ద్వారా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రణాళికలు, కార్యక్రమాలను నిర్ణయిస్తుంది.

11 జనవరి 2025న ‘ప్రతిష్ఠ ద్వాదశి’
ఈసారి ప్రతిష్ట ద్వాదశి 11 జనవరి 2025న వస్తుంది. ఇది బాల రామయ్య గర్భ గుడిలో కొలువుదీరిన రోజునే.. మొదటి వార్షికోత్సవంగా జరుపుకుంటారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ ప్రాణ ప్రతిష్ఠ 2024 జనవరి 22న జరిగిందని.. అయితే హిందూ తిధి ప్రకారం ఈసారి ద్వాదశి తిథి జనవరి 11న వస్తోంది. ఈ రోజున అత్యంత వైభవంగా జరుపనున్నామని తెలిపారు.