News

ఆలయ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

376views

దేవాలయ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ ఏసీ ఎం పానకాలరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పామూరులో సర్వేనంబర్‌ 329/2,3, 442/1,2,3 లలోని మదన వేణుగోపాలస్వామి, వల్లీసమేత భుజంగేశ్వరస్వామి దేవాలయ భూముల్లో ఆక్రమణలను ఆయన ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబుతో కలిసి పరిశీలించారు. తక్షణం ఆక్రమణలను తొలగించి భూములు ఆలయాలకు చెందేలా చూడాలని ఆదేశించారు. అలాగే స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, అనుమలశెట్టి సత్రం ఆస్తులను పరిశీలించారు. వీటిపై ఈఓగా నరసింహబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా వీటికి సంబంధించిన ఆస్తులు, ఆదాయాలను విచారించి నివేదికను పంపాలని ఎండోమెంట్‌ కందుకూరు డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.సత్యనారాయణ, ఈఓ నరసింహబాబులను ఏసీ ఆదేశించారు. గుర్రం వెంకటేశ్వర్లు, బండ్ల నారాయణ, సిద్దవటం నరసింహులు, పలువురు పాల్గొన్నారు.