
300views
నిర్విరామంగా 20 నిమిషాల పాటు శంఖారావాన్ని పూరించడంలో జాతీయస్థాయిలో ఖ్యాతిని ఆర్జించి అనేక రికార్డులను, అవార్డులను, సువర్ణ ఘంటా కంకణాలు సాధించిన శంఖారావ యు‘గళం’ డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు మరో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ దంపతులకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కామథేను జాతీయ పురస్కారాన్ని హైదరాబాద్ టూరిజం ఫ్లాజాలో జరిగిన ఓ కార్యక్రమంలో అందజేసింది. ఆ సంస్థ సీఈఓ సత్యవోలు రాంబాబు ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందా చేతుల మీదుగా ఆ దంపతులు పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డుల ప్రదానోత్సవాన్ని వీరి శంఖారావంతో ప్రారంభించారు.తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన డాక్టర్ నరసింహరావు ఏపీ ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్) కమాండెంట్‌గా రాజమహేంద్రవరంలో విధులను నిర్వర్తిస్తున్నారు.





