News

బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలి

273views

బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు రక్షణ కల్పిం చాలని విశ్వ హిందూ పరిషత్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆ దేశంలో హిందువులపై జ రుగుతున్న దాడులను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చేపట్టిన సంఘీభావ ర్యాలీ విజయవంతంగా సాగింది. గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం నుంచి విశ్వ హిందూ పరిషత్‌ సభ్యు లతోపాటు అయ్యప్ప, హనుమాన్‌, శివ మాల లు ధరించిన స్వాములు, అంగన్‌వాడీ కార్యకర్త లు భారీగా తరలివచ్చి సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీగా బస్టాండ్‌ వద్దకు చేరు కొని బైఠాయించి జైశ్రీరాం నినాదాలతో హోరె త్తించారు. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సేవా సంస్థ సభ్యులు రాంప్రసాద్‌ మాస్టారు, పాక తులసీదాస్‌ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరగుతున్న దాడులు అమానవీయమని, హిందువులంతా ఒక్కటికావాలని, లేకుంటే రాబోయే రోజుల్లో మన దేశంపై కూడా దాడులు జరగవచ్చునన్నారు. కార్యక్రమంలో వివిధ దేవాలయాల కమిటీలు, వ్యాపార, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు, బీజేపీ జిల్లా మోర్చా అధ్యక్షురాలు బింగి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.