
225views
దేశ, రాష్ట్ర అభివృద్ధి పథంలో నడవాలని ప్రార్థిద్దామని అపర రామానుజులు, ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన జీయర్ స్వామి పిలుపునిచ్చారు. విశాఖలో శ్రీరామ పాదుకా ఆరాధన పూజలు వైభవంగా జరిగాయి. గీతా జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం భక్తులనుద్దేశించి చిన జీయర్ స్వామి మాట్లాడారు. అనంతరం స్వామివారు భక్తులతో స్వయంగా శ్రీరామ పాదుకా ఆరాధన పూజలు నిర్వహించారు. దేశం, రాష్ట్రం అభ్యున్నతి చెందడానికి మనవంతు బాధ్యతగా స్వామిని ప్రార్థించాలన్నారు. కార్యక్రమంలో వికాస తరంగిణి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్‌ఆర్ వర్మ, వారిజ వేద పాఠశాల అధ్యాపకులు ముడుంబై శ్రీకాంత్ స్వామి, సంతోష్ కుమార్ స్వామి, వారిజ కమిటీ సభ్యులు ఎంఎస్ రాజు, కాసి రాజు, తదితరులు పాల్గొన్నారు.





