NewsProgramms

ఆరోగ్య భారతి నంద్యాల ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి

313views

ఆరోగ్య భారతి- నంద్యాల ఆధ్వర్యంలో 28.11.2024 గురువారం సాయంత్రం 5 గంటల 30 నిమిషముల నుండి ఆరోగ్య భారతి కుటుంబ సమ్మేళనం కార్యక్రమాన్ని స్థానిక పద్మావతి నగర్ లోని నందలి శ్రీకృష్ణ మందిరంలో కార్తీక బహుళ త్రయోదశి- ధన్వంతరి జయంతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మరియు అల్లోపతి వైద్యులు పాల్గొని ఆహారం, ఆరోగ్యం, ఆహార నియమాలు, వ్యాధులతో ఆచరించవలసిన పథ్యం, గృహవైద్యం, కుటుంబ విలువలు-మన బాధ్యత అనే అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ గెలివి సహదేవుడు ఆరోగ్య భారతి – నంద్యాల 2025 క్యాలెండర్ ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త సీనియర్ వైద్యులు డాక్టర్ గేలివి సహదేవుడు మాట్లాడుతూ మన ప్రాచీన వైద్య చికిత్సల గురించి వివరించారు.అలాగే ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అలీ భాష, డాక్టర్ బాల వెంకట కృష్ణ, డాక్టర్ శ్రావణ సంధ్య తదితరులు మాట్లాడుతూ దైనందిన దినచర్యలో తీసుకోవాల్సిన ఆహారం,ఋతువుల పరంగా, వ్యక్తిగత, దేశ స్థితిగతులను బట్టి ఎవరు ఏ రకమైన ఆహారం ఎలా తీసుకోవాలో,ఆహారం తీసుకోవటంలో పాటించాల్సిన నియమాలు గురించి సంక్షిప్తంగా వివరించారు

ప్రధాన వక్తగా విచ్చేసిన కర్నూల్ విభాగ్ కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ చలమల రామకృష్ణ మాట్లాడుతూ కుటుంబంలోని వ్యక్తుల మధ్య పెంపొందాల్సిన ప్రేమ బాధ్యతల గురించి, భారతీయ జీవన విలువల గురించి ఉదాహరణల ద్వారా చక్కగా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు కమిటీ సభ్యులు,టి. చెన్నకేశవులు జిల్లా కార్యదర్శి, డాక్టర్ బాల వెంకటకృష్ణ నంద్యాల నగర అధ్యక్షులు,కె విజయభాస్కర్ రెడ్డి, కార్యదర్శి శంకరాచార్య, ఉపాధ్యక్షులు శ్రీమతి ఉమాదేవి, సహకార్యదర్శి పుల్లయ్య, కమిటీ సభ్యులు, కృష్ణారెడ్డి, ఆధ్యాత్మిక ప్రసంగీకులు డాక్టర్ శ్రావణ సంధ్య, ఆయుర్వేద డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ విజయ చంద్రుడు, శ్రీకృష్ణ మందిరము కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు పార్థసారథి కృష్ణ, మరియు ప్రముఖ ఉపాధ్యాయులు, మాతృమూర్తులతో పాటు స్థానిక పెద్దలు 200 పాల్గొన్నారు.