
ఆంధ్ర చరిత్రలో పల్నాటి యుద్ధ చరిత్ర ఎంతో ప్రముఖమైనది.ఆ యుద్ధంలో రెండు వైపులా ప్రముఖ నాయకులు 66 మంది తనువు చాలించారు.వేలాది మంది చనిపోయారు.కనుకనే వీరుల అమావాస్య పేరు వచ్చింది. వీటితో యుద్ధం ముగిసింది.నలగామ రాజును తిరిగి రాజును చేసి,బ్రహ్మనాయుడు గుత్తికొండ బిలంకు తపస్సుకి వెళ్ళిపోయాడు.
800 సం.ల క్రితం బ్రహ్మ నాయుడు అనేక సమతా ఉద్యమాలు పల్నాడులో నిర్వహించారు. మొదటిగా గురజాల లోని శ్రీ రామ దేవాలయంలోకి అన్ని కులాల వారిని ఎస్సీలతో సహా ప్రవేశం కల్పించారు. చాపకూడు నిర్వహించారు.ఎస్సీ కి చెందిన కన్నమ దాసును సైన్యాక్షుడిని చేశాడు.
తెలుగు గడ్డపై వారు నిర్వ హించిన సమతా ఉద్యమాలను స్మరించుకుంటూ గురజాల కూడలిలో బడిదేల శ్రీనివాస రావు అధ్యక్షతన బ్రహ్మ నాయుడు విగ్రహానికి పూలమాల వేశారు.తరువాత అయ్యప్ప భక్తుల ప్రసాద కార్యక్రమంలో వారి సేవలను స్మరించుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సమరసత ప్రచార ఉద్యమాన్ని 10 రోజుల పాటు ప్రారంభించింది.

ఈ కార్యక్రమంలో శ్యాం ప్రసాద్ -జాతీయ కన్వీనర్, శ్యామ్ మోహన రావు – గుంటూరు విభాగ కన్వీనర్, రాము – పల్నాడు కన్వీనర్ నరసింహమూర్తి,తదితర స్థానిక ప్రముఖులు ఉప్పిడి నరసింహారావు,జక్క సత్యం,లింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.





