News

హిందూ ధర్మరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే..

253views

అన్య మతస్థుల ప్రభావం పెరుగుతున్న తరుణంలో సనాతన హిందూ ధర్మరక్షణ బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పొందూరు కృష్ణాపురం ఆనందాశ్రమంలో 19వ అఖిలభారత హిందూ ధార్మిక మహాసమ్మేళనం నిర్వహించారు. ప్రపంచానికి సనాతన ధర్మాన్ని, శాంతిని ప్రభోదించే దేశంలో ప్రభుత్వాల వల్ల హిందువుల సంఖ్య తగ్గి అన్యమతస్థులు పెరిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఒంగోలు త్రిపుర భైరవేశ్వరా నంద స్వామి, హైదరాబాద్‌ యోగీష్‌ ప్రభు స్వామీజీ, మంగళగిరి దయానంద దత్త స్వామీజీ, హైదరాబాద్‌ అహోబిల స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.